రిపబ్లిక్ టీవీకి మరిన్ని కష్టాలు
Case Against Republic TV. రిపబ్లిక్ టీవీ ఒకప్పుడు ఎన్నో బ్రేకింగ్ న్యూస్ అందించేది. కానీ ఆ మీడియా సంస్థనే
By Medi Samrat Published on 10 Nov 2020 1:47 PM ISTరిపబ్లిక్ టీవీ ఒకప్పుడు ఎన్నో బ్రేకింగ్ న్యూస్ అందించేది. కానీ ఆ మీడియా సంస్థనే బ్రేకింగ్ న్యూస్ లో నిలిచింది. ఓ వైపు అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా.. మరోవైపు టీఆర్పీ స్కామ్ ఆ ఛానల్ ను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి 'రిపబ్లిక్ టీవీ' డిస్స్ర్టిబ్యూషన్ హెడ్ ఘన్శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ కేసులో అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే రిపబ్లిక్ టీవీ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు.
టీఆర్పీ ఛానల్స్ స్కామ్ లో రిపబ్లిక్ చానల్‌తో పాటు ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా వంటి రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి. టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు ఆరోపించారు. టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు.
బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. తమ ఛానల్ కు ఎక్కువ మొత్తంలో టీఆర్పీ లభిస్తోందని చెబుతూ పెద్ద ఎత్తున డబ్బులను అడ్వర్టైజర్ల నుండి అందుకుంటూ ఉన్నారు.