వచ్చే ఎన్నికలకు ఇది ట్రైలర్ మాత్రమే
It is trailer for upcoming elections: Gujarat CM I దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఉప ఎన్నికల
By సుభాష్ Published on 10 Nov 2020 4:44 PM ISTదేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. తీవ్ర ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఈ ఓట్ల లెక్కింపుల్లో బీజేపీ దూసుకుపోతోంది. తాజాగా తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక గుజరాత్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగిన 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసే విధంగా ఆధిక్యంలో కొనసాగుతోంది. నవంబర్ 3న ఇక్కడు ఉప ఎన్నికలునిర్వహించారు. మొత్తం 81 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 60.75 శాతం పోలింగ్ నమోదైంది. అయితే అబ్దాసా, దాంగ్స్, ధారీ, గధాడా, కప్రాడా, కర్జాన్, మోర్బీ, ఇలంబ్డీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తొలి నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఒక్క మోర్బీలోనే కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యంతో స్వల్ప తేడాతో కొనసాగుతోంది.
ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారీ విజయమని, వచ్చే ఎన్నికలకు ఇది ట్రైలర్ మాత్రమేనని అన్నారు. అయితే కాంగ్రెస్ మునిగిపోతున్న నావా లాంటిదని వ్యాఖ్యనించారు. ప్రతి చోట వారిని ప్రజలు తిరస్కరిస్తున్నారని విజయ్ రూపానీ అన్నారు. గుజరాత్‌లో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక బీహార్‌లో కూడా బీజేపీ హవా కొనసాగిస్తోంది. గంట గంటకు బీజేపీ ఆధిక్యం పెరుగుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం పొంగిపోతోంది.