గ్రేటర్ భాగ్యనగరానికి మరో మణిహారం

గ్రేటర్‌ భాగ్యనగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ మంగళవారం ప్రారంభమైంది.

By సుభాష్  Published on  10 Nov 2020 9:14 AM GMT
గ్రేటర్ భాగ్యనగరానికి మరో మణిహారం

గ్రేటర్‌ భాగ్యనగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ మంగళవారం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్‌ ఇదే. జవహార్‌నగర్‌లోఇన ఈ ప్లాంట్‌ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. కేటీఆర్‌తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ లోకేష్ కుమార్‌ తదితరులున్నారు.

ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇంటిగ్రేటెడ్‌ మున్సిపల్‌సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌ టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. మలి దశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభం అయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్‌ నగర్‌కు తరలిస్తున్న చెత్త నుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్‌ వల్ల చెత్త నుంచి విద్యుత్‌తో చెత్త సమస్య పరిష్కారంతో పాటు పరిసరాల్లోప్రజలకు ఎలాంటి కాలుష్యం తగ్గడమే కాకుండా చెత్త నుంచి ఆదాయం కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.
Next Story
Share it