న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
November 20 Top Ten News .. దర్శకుడిగా, కొరయోగ్రాఫర్‌గా కెరియర్‌లో సక్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్రభుదేవా.
By సుభాష్ Published on 20 Nov 2020 5:18 PM IST1.'గ్రేటర్'లో ముగిసిన నామినేషన్ల పర్వం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి నామినేషన్లను అధికారులకు సమర్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కామారెడ్డి పట్టణ సీఐ ఇంట్లో ఏసీబీ దాడులు
అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) తెలంగాణలో సోదాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి, ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. అయితే రాత్రి వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: బీజేపీకి పూర్తి మద్దతు: పవన్ కల్యాణ్
గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరమించుకుంది. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తామని పవన్ కల్యాన్ అన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకున్నట్లు పవన్ వివరించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ తర్వాత పవన్ నిర్ణయం తీసుకున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. 76 మంది పిల్లల్ని రక్షించిన ఆ మహిళా కానిస్టేబుల్‌కు డైరెక్ట్ ప్రమోషన్
న్యూఢిల్లీ: ప్రమోషన్ కొట్టడం అంత సులువు కాదు. అది ప్రభుత్వ కంపెనీల్లో అయినా ప్రైవేటు సంస్థలోనైనా కావొచ్చు. ఉద్యోగులు మంచి ప్రతిభ చూపితే ప్రమోషన్ రావడం సులువే. ఎంప్లాయి తన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తే మంచి పేరుతోపాటు ప్రమోషన్‌లు కూడా దక్కుతాయి. దీనికి ఢిల్లీకి చెందిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ సీమా ధాకాను ఉదాహరణగా చెప్పొచ్చు. 76 మంది పిల్లలను వారి కుటుంబాలకు సురక్షితంగా అందించిన ఢిల్లీ పోలీస్ మహిళా హెడ్ కానిస్టేబుల్ సీమా ధాకాకు ప్రమోషన్ లభించింది. తప్పిపోయిన పిల్లలను వారి ఇళ్లకు చేర్చడంలో కృషి చేసినందుకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. నేనొక్కదాన్నే ధోనికి కోపం తెప్పించగలను..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికి తెలిసిందే. మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లో తన సహనాన్ని కోల్పోడు. అందుకనే అభిమానులు కూడా అతడిని ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. మరీ ధోనికి కోపం వస్తుందా..? అతడికి కోపం తెప్పించడం ఎవరి వల్లనైనా సాధ్యమా..? అంటే అవుననే అంటోంది అతడి భార్య సాక్షి. ధోనికి కోపం తెప్పించేది తాను ఒక్కదానినేనని అంటోంది... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీం కోర్టు షాక్
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రికెట్ కార్డు వినియోగదారులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయం స్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రెడిట్ కార్డుదారులు రుణ గ్రహితల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్‌కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఢిల్లీ నుంచి బయటికి వెళ్లండి : సోనియాకు వైద్యుల సూచన
దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్యులు సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఆమెకు ఈ సలహా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. జూలై 30 న ఆమె గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా..!
దర్శకుడిగా, కొరయోగ్రాఫర్‌గా కెరియర్‌లో సక్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్రభుదేవా. అయితే.. ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపించగా.. ప్రస్తుతం అవి ఫేక్ అని తేలింది. బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ ను రెండో పెళ్లి చేసుకున్నాడని.. ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. చార్మినార్: టెన్షన్... టెన్షన్.. బండి సంజయ్ సవాల్.. అమ్మవారి ఆలయంలో పూజలు
గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వరదసాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పదివేల ఆర్థిక సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద ఎన్నికల సంఘానికి రాసిన లేఖ తీవ్ర వివాదం రేపుతోంది. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణమంటూ టీఆర్‌ఎస్ నేతలు విమర్శలకు దిగారు. ఆ లేఖతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంజయ్ చెప్పుకొచ్చారు. తమను దొంగ దెబ్బ తీయడానికి సీఎం కేసీఆర్ ఆడిన నాటకంలో భాగమే ఈసీకి లేఖ అని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బల్దియాతో ప్రారంభించి.. తిరుగులేని నేతలుగా ఎదిగింది వీళ్లే..
జీహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైంది. బలమైన రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా భావించే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను.. కొంతమంది నేతలు గతంలో తమ రాజకీయ ఎదుగుదలకు వేదికగా మలుచుకున్నారు. కార్పొరేటర్లుగా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల వరకూ వెళ్లారు. అందులో ముఖ్యంగా పలువురి నేతల గూర్చిన వివరాలు తెలుసుకుందాం..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి