నేనొక్క‌దాన్నే ధోనికి కోపం తెప్పించ‌గ‌ల‌ను..

Sakshi Dhoni Celebrates 32nd Birthday With MS Dhoni. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోని ఎంత ప్ర‌శాంతంగా ఉంటాడో

By Medi Samrat  Published on  20 Nov 2020 3:53 PM IST
నేనొక్క‌దాన్నే ధోనికి కోపం తెప్పించ‌గ‌ల‌ను..

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోని ఎంత ప్ర‌శాంతంగా ఉంటాడో అంద‌రికి తెలిసిందే. మైదానంలో ఎలాంటి ప‌రిస్థితుల్లో త‌న స‌హ‌నాన్ని కోల్పోడు. అందుక‌నే అభిమానులు కూడా అత‌డిని ముద్దుగా మిస్ట‌ర్ కూల్ అని పిలుచుకుంటారు. మ‌రీ ధోనికి కోపం వ‌స్తుందా..? అత‌డికి కోపం తెప్పించ‌డం ఎవ‌రి వ‌ల్ల‌నైనా సాధ్య‌మా..? అంటే అవున‌నే అంటోంది అత‌డి భార్య సాక్షి. ధోనికి కోపం తెప్పించేది తాను ఒక్క‌దానినేన‌ని అంటోంది.



గురువారం సాక్షి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో ఓ వీడియో పంచుకుంది. ఈ వీడియోలో త‌న భ‌ర్త ధోని, కూతురు జీవా గురించి కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ధోనికి కోపం వ‌చ్చేది త‌న‌వ‌ల్లేన‌ని. ఎందుకంటే.. అత‌డితో సన్నిహితంగా ఉండేది తాను ఒక్క‌దాన్ని మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చింది. ఇంట్లో ఇద్ద‌రం ఉన్న‌ప్పుడు క్రికెట్ అస‌లు మాట్లాడుకోమ‌ని తెలిపింది. అది అత‌డికి ఇష్ట‌మైన ఆట‌. అదొక ప్రొపెష‌న్‌. ఎవ‌రైనా ఒక వ్య‌క్తి ఆఫీస్‌కు వెళ్లొచ్చాక ఈ రోజు ఎలా గ‌డిచింది.. మీ బాస్ ఏమ‌న్నారు అని అడ‌గ‌కూడ‌ద‌ని సాక్షి చెప్పింది.

ఇక త‌న ముద్దుల కూతురు జీవా గురించి మాట్లాడుతూ.. జీవా త‌న మాట అస్స‌లు విన‌ద‌ని చెప్పింది. తాను ఎన్నిసార్లు అన్నం తిన‌మ‌ని చెప్పినా విన‌ద‌ని.. అదే ధోని చెప్పే వెంట‌నే తినేస్తుంద‌ని చెప్పింది. ఇక కెరీర్ ఆరంభంలో ధోనికి పొడ‌వాటి జ‌ట్టు ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ధోని స్టైల్ కి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. దీనిపై సాక్షి మాట్లాడుతూ.. అదృష్టం కొద్ది పొడ‌వాటి నారింజ రంగు జుట్టులో ఉన్న ధోనిని చూడ‌లేదు. ఒక‌వేళ అలా చేసుంటే త‌ర్వాత మ‌ళ్లీ అత‌న్ని చూసేదాన్ని కాదేమో. పొడ‌వాటి జుట్టు జాన్ అబ్ర‌హంకు స‌రిపోతుంది కానీ ధోని కాద‌ని సాక్షి చెప్పింది.

ఇక సాక్షి పుట్టిన రోజు సంద‌ర్భంగా ధోనీ దుబాయ్‌లో పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకల్లో భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్థాన్ ఆట‌గాడు షోయబ్ మాలిక్ కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంది.


Next Story