అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) తెలంగాణలో సోదాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి, ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. అయితే రాత్రి వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడిన అధికారులపై ఏసీబీ కొరఢా ఝులిపించింది. పోలీసు శాఖలో కూడా సోదాలు చేపట్టి అవినీతి అధికారులను సైతం కటకటాలవెనక్కి నెట్టింది. అవినీతి అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా.. ఇలాంటి అవినీతి అధికారులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు.

సుభాష్

.

Next Story