రెండో పెళ్లి చేసుకున్న ప్ర‌భుదేవా..!

Prabhudeva second marriage .. ద‌ర్శ‌కుడిగా, కొర‌యోగ్రాఫ‌ర్‌గా కెరియ‌ర్‌లో స‌క్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్ర‌భుదేవా

By సుభాష్  Published on  20 Nov 2020 1:31 PM IST
రెండో పెళ్లి చేసుకున్న ప్ర‌భుదేవా..!

ద‌ర్శ‌కుడిగా, కొర‌యోగ్రాఫ‌ర్‌గా కెరియ‌ర్‌లో స‌క్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్ర‌భుదేవా. అయితే.. ఈ ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపించ‌గా.. ప్ర‌స్తుతం అవి ఫేక్ అని తేలింది. బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెర‌పిస్ట్ ను రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని.. ప్ర‌భుదేవాకు అత్యంత స‌న్నిహితులైన ఒక‌రు మీడియాతో పంచుకున్నారు.

గతంలో వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా.. పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారట‌. కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం వీరిద్దరూ.. సెప్టెంబ‌ర్‌లో ముంబైలోని ప్ర‌భుదేవా నివాసంలో అత్యంత ర‌హ‌సంగ్యా వివాహం చేసుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ కొత్త జంట చెన్నైలో నివాసం ఉంటున్నారు. కాగా.. దీనిపై ప్ర‌భుదేవా ఇంత వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ప్ర‌భుదేవా 1995లో రామలతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే.. వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో.. 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆత‌రువాత స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. కాగా.. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా రాధే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో స‌ల్మాన్‌, దిశా ప‌టానీ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేట‌ర్లు ప్రారంభం అయిన త‌రువాత జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story