క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సుప్రీం కోర్టు షాక్‌

Credit card holders moratorium .. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో విధించిన ఆరు నెలల మారటోరియం

By సుభాష్  Published on  20 Nov 2020 2:51 PM IST
క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సుప్రీం కోర్టు షాక్‌

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రికెట్‌ కార్డు వినియోగదారులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. క్రెడిట్‌ కార్డు వినియోగదారులు రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయం స్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రెడిట్‌ కార్డుదారులు రుణ గ్రహితల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్‌కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలో న్యాయస్థానం తెలిపింది. అలాగే ప్రీ-కోవిడ్‌ ఇఫాల్టర్లు కూడా చక్రవడ్డీ మాఫీ పొందలేరని తెలిపింది. రుణ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

వడ్డీ మినహాయింపు ప్రణాళికలో ఇప్పటి వరకు 13.12 కోట్ల ఖాతాలకు రూ.5270 కోట్లు జమ అయ్యాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు. కరనా నేపథ్యంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మార్చి నుంచి ఆగస్టు వరకు రుణ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ కాలంలో రెండు కోట్ల వరకున్న అన్ని రుణాలపై వడ్డీని రద్దు చేసింది. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయగా, దీనికి సంబంధించిన చెల్లింపులు కూడా ప్రారంభించింది.

Next Story