'గ్రేటర్'లో ముగిసిన నామినేషన్ల పర్వం
Nominations Process End For GHMC. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం
By Medi Samrat Published on
20 Nov 2020 11:16 AM GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి నామినేషన్లను అధికారులకు సమర్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి.
నిన్నటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి రోజు అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే.. శనివారం అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.
Next Story