న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

By Newsmeter.Network  Published on  7 Dec 2019 4:09 PM GMT
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

1. మరో దారుణం... మైనర్‌ యువతిపై రెండు సార్లు గ్యాంగ్‌రేప్‌

దేశంలో అఘాయిత్యాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కామాంధుల ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్‌లో దిశ ఘటన మరువకముందు మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. హర్యానాకు చెందిన మైనర్‌ యువతిపై నలుగురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. అంతే కాదు.. ఈ యువతిపై ఐదు నెలల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారం జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆరా తీసిన ‘ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు’

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను నిన్న ఘటన స్థలానికి తీసుకువచ్చి విచారిస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పోలీసులపై రాళ్లురువ్వడంతో, వారిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించి, వారి వారి కుటుంబీకులకు అప్పగించే క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. మృతదేహాలను 9వ తేదీ వరకు భద్రపర్చాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు.. ఎక్క‌డంటే..

రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసును వరంగల్ కమిషనరేట్ ప‌రిధిలోని సుబేదారి పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తె శ్రీ విద్య(24) సంవత్సరాలు కనిపించడం లేదు. అయితే.. ఈ విష‌య‌మై వరంగల్ లోని కాశీబుగ్గలోని త‌న త‌మ్ముడు బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. విలియమ్స్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన కోహ్లీ..!

నిత్యం అంద‌రి నోళ్ల‌ల్లో నానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. శుక్ర‌వారం ఉప్పల్ స్టేడియం వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మ‌రోమారు వార్తల్లో నిలిచాడు. వివ‌రాళ్లోకెళితే.. నిన్న విండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బౌల‌ర్ కెస‌రిక్ విలియమ్స్ బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్ బాదాడు. అనంత‌రం విలియమ్స్ ఉద్దేశించి కోహ్లీ తన ‘చేతిని తెరిచిన నోట్‌బుక్ లా మార్చి.. రైట్‌ టిక్‌’ కొడుతున్నట్లు చేసిన సంబ‌రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్‌లో కొత్త ట్విస్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె డిసెంబర్‌ 20న మృతి చెందింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడగా, ఒక నిందితున్ని మైనర్‌ అని శిక్ష విధించలేదు. నిందితుల్లో వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. ‘బోయపాటి’కి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు !

మొత్తానికి బోయపాటి శ్రీనులో మార్పు రాబోతుంది. చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ ప్లాప్ దెబ్బకి అవమానభారాలను మోస్తూ.. మరో సినిమా మొదలెట్టడానికి చాల గ్యాపే తీసుకోవాల్సి వచ్చింది. పోనీ అంత గ్యాప్ తీసుకుని ఏ 100 కోట్ల హీరోతో సినిమా చేస్తున్నాడా అంటే.. చివరికి బాలయ్యతోనే సినిమా చేస్తున్నాడు. నిన్నే ఓపెనింగ్ అయిన బాలయ్య – బోయపాటి సినిమా అంటేనే.. యాక్షన్ కి పీక్స్ అన్న రేంజ్ లో ఉంటుంది సినిమాలో యాక్షన్. అయితే బోయపాటి మాత్రం ఈ సారి యాక్షన్ మోతాదును తగ్గించబోతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సీరియల్ రేపిస్ట్ శ్రీనివాసరెడ్డి డిఎన్ఎ పరీక్షల నివేదిక

హాజీపూర్ లో జరిగిన అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడు ఎమ్. శ్రీనివాసరెడ్డికి చెందిన వేలి ముద్రలను, డిఎన్ఎను పరీక్షంచగా నిందితుడు నేరానికి పాల్పడినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోందని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అధికారులు నల్గొండ ఎడిజి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు విన్నవించారు. హాజీపూర్ అత్యాచారం, హత్య కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మూడు చార్జ్ షీట్లు సమర్పించిన నల్గొండ జిల్లా పోలీసులు శ్రీనివాసరెడ్డి పాత్రపై వేగంగా విచారణ జరుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు

దేశవ్యాప్తంగా ‘దిశ’ ఘటన సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విచారణలో భాగంగా నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారుపోలీసులు. ఇంత సంచలనంగా మారిన ఎన్‌కౌంటర్‌ వ్యవహారం తాజాగా సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ఉప్ప‌ల్ ‘ఉప్పెన‌’లో కొట్టుకుపోయిన రికార్డులు..!

నిన్న సాయంత్రం ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6×4, 6×6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5×4, 4×6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. తొల‌గిన అడ్డంకులు.. విడుద‌ల ఎప్పుడంటే..!

హైదరాబాద్‌: వివాద‌స్ప‌ద‌ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ విష‌య‌మై వర్మ.. ఈ నెల 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను అని ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story