'బోయపాటి'కి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు !

By Newsmeter.Network  Published on  7 Dec 2019 12:25 PM GMT
బోయపాటికి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు !

మొత్తానికి బోయపాటి శ్రీనులో మార్పు రాబోతుంది. చరణ్ తో చేసిన 'వినయ విధేయ రామ' ప్లాప్ దెబ్బకి అవమానభారాలను మోస్తూ.. మరో సినిమా మొదలెట్టడానికి చాల గ్యాపే తీసుకోవాల్సి వచ్చింది. పోనీ అంత గ్యాప్ తీసుకుని ఏ 100 కోట్ల హీరోతో సినిమా చేస్తున్నాడా అంటే.. చివరికి బాలయ్యతోనే సినిమా చేస్తున్నాడు. నిన్నే ఓపెనింగ్ అయిన బాలయ్య - బోయపాటి సినిమా అంటేనే.. యాక్షన్ కి పీక్స్ అన్న రేంజ్ లో ఉంటుంది సినిమాలో యాక్షన్. అయితే బోయపాటి మాత్రం ఈ సారి యాక్షన్ మోతాదును తగ్గించబోతున్నాడు. 'వినయ విధేయ రామ' డిజాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలోని యాక్షన్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనని.. అందుకే బాలయ్యతో చేయబోయే సినిమాలోనైనా యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని బోయపాటి ఫిక్స్ అయ్యాడట.

ఇప్పటికే బోయపాటి ఫైట్స్ విషయంలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో రియలిస్టిక్ యాక్షన్ తోనే ముందుకు వెళ్లదామని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని.. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇంతకు ముందు వార్తలు వచ్చినట్లు ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదట. కేవలం ఈ చిత్రం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనరేనని తెలుస్తోంది. ఇంతకుముందు బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ, లెజెండ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ చిత్రం కూడా హిట్ అయితే, వీళ్లిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ఫ్లాపులో ఉన్న ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందా ? చూడాలి.

Next Story
Share it