న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 21 July 2020 4:17 PM IST
సుశాంత్.. ‘సూసైడ్ ఆర్ మర్డర్’ ఫస్ట్‌లుక్ విడుదల
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్య చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సుశాంత్ మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
టిక్‌టాక్‌కు చివరి వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్
టిక్‌టాక్ కు గట్టి షాకిచ్చిన భారత్.. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాక్.. ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్థాన్.. టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డైన్స్ ను ఆదేశించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బిగ్‌బాస్-4 ప్రోమో విడుదల
బుల్లితెర అభిమానులకు ఇక పండగే అని చెప్పాలి. బిగ్‌బాస్-4 రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షో తెలుగులో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలోకూడా రేటింగ్ పరంగా ఎంతో దూసుకుపోయింది. తెలుగు ప్రజలు కూడా ఈ షోకు ఎంతో ఆకర్షితులయ్యారు. ఇక నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. తాజాగా బిగ్‌బాస్-4కు సంబంధించిన .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అర్ణబ్ గోస్వామితో డిబేట్.. నటి కస్తూరి భోంచేస్తూ కనిపించింది..!
అర్ణబ్ గోస్వామి తో డిబేట్ అంటే మామూలుగా ఉండదు. ఆ డిబేట్ లలో ఎంతో మంది పాల్గొంటూ ఉంటారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా అర్ణబ్ షోలో పాల్గొన్నారు. ఆమె చేసిన ఓ పని దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి అర్ణబ్ గోస్వామి తన ఛానల్ లో డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్ లో పాల్గొన్న కస్తూరి శంకర్ లంచ్ చేస్తూ కనిపించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పీవీ కుమార్తె వాణీదేవిని సీఎం కేసీఆర్ కౌన్సిల్‌కు పంపనున్నారా.?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి త్వరలోనే తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి అడుగుపెట్టేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. గవర్నర్ నామినీగా వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళసై ను సోమవారం నాడు కోరినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
డేంజర్ జోన్‌లో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. ఇక భాగ్యనగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హైదరాబాద్ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారిపోయింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు,పుణే నగరాల్లో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గినా..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజీవ్‌గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరు జైలులో మంగళవారం ఉదయం ఈ ఆత్మహత్యయత్నం చేశారు. విషయాన్ని గమనించిన జైలు సిబ్బంది ఆమెకు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారో తెలియరాలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కేంద్రం కొత్త రూల్.. కల్తీ వస్తువులకు యావజ్జీవం
వస్తువు ఏదైనా సరే కేరాఫ్ కల్తీగా మార్చేస్తున్న ఉదంతాల్ని ఇప్పటికే చూస్తున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ కల్తీ వస్తువుల తయారీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినమైన చట్టాల అవసరాన్ని కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం 1986 స్థానంలో తాజాగా 2019 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కూతుళ్ల ముందే జర్నలిస్టును తుపాకీతో కాల్చిన దుండగులు..!
ఘజియాబాద్: జర్నలిస్టును కూతుళ్ల ముందే కాల్చిన ఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జర్నలిస్ట్ విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళుతుండగా కొందరు అడ్డుగా వచ్చారు. తమ దగ్గర ఉన్న తుపాకీతో విక్రమ్ జోషి మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషి తలపై తూటా దూసుకువెళ్లింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పట్టి పీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 230 దేశాలకుపైగా చాపకింద నీరులా వ్యాప్తించి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్‌యంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని కరోనా కేసుల సంఖ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తమ దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు. మున్ముందు కరోనా కేసులు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి