టిక్‌టాక్‌ కు గట్టి షాకిచ్చిన భారత్‌.. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌ కూడా గట్టి వార్నింగ్‌ ఇచ్చేసింది. పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాక్‌.. ఇప్పుడు టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్థాన్‌.. టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డైన్స్‌ ను ఆదేశించింది పాక్‌ ప్రభుత్వం. పబ్జీ, టిక్‌టాక్‌లే కాకుండా సోషల్‌ మీడియాలోని పలు యాప్‌లలో అసభ్యకరంగా కంటెంట్‌ ఉంటుందని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని పాకిస్థాన్‌ టెలి కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెబుతోంది.

ఎక్కువగా టిక్‌టాక్‌, బిగోలోనే అడల్ట్‌ కంటెంట్‌ ఉంటోందని పేర్కొంది. ఈ కారణంగా యువత చెడుదారిన పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఈ విషయమై ఆయా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేశామని పేర్కొంది. ఇప్పటికే బిగోను నిషేధించామని, టిక్‌టాక్‌కు ఆఖరి హెచ్చరిక జారీ చేశామని, టిక్‌టాక్‌లో మితిమీరుతున్న అశ్లీలతను, అసభ్యతను , అనైతిక వీడియోలను నియత్రించేందుకు సమగ్రమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించామని పాక్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెబుతోంది. ఈ కారణంగా దేశ  సమగ్రతకు ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశామని, దీంతో పాటు చైనాకు చెందిన మరో 58 యాప్‌లపై నిషేధం విధించామని పేర్కొంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort