పౌరసత్వ సెగలు: ప్రముఖ సినీనటుడిపై కేసు నమోదు

By సుభాష్
Published on : 20 Dec 2019 4:45 PM IST

పౌరసత్వ సెగలు: ప్రముఖ సినీనటుడిపై కేసు నమోదు

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, హింసాత్మక ఘటనలతో దద్దరిల్లిపోతోంది. దీంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆందోళనలోపాల్గొన్న 700 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ ఇందులో ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది. రాజకీయ పార్టీలకు చెందిన కొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. భీం ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీదు నుంచి జంతర్‌ మంతర్‌ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

Violent Protests Citizenship1

Next Story