న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 18 Aug 2020 12:05 PM GMTఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24గంటల్లో 56,090 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,652 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.340 తగ్గి ప్రస్తుతం ధర రూ.55,320కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.310 తగ్గుతూ ప్రస్తుతం ధర రూ.50,700కు చేరుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఈ ఏడాది ఇక ‘డ్రీమ్ లెవెన్ ఐపీఎల్’.. ఒక్క ఏడాదికి ఎన్ని కోట్లు వెచ్చించారంటే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు రెండేళ్లుగా టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్న ‘వివో’ మొబైల్ సంస్థ ఈసారి అనివార్య పరిస్థితుల్లో ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చైనా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ‘వివో’ను తప్పించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో బీసీసీఐ, వివో ఉమ్మడి అంగీకారంతో ఈ ఏఢాదికి ఒప్పందం రద్దు చేసుకున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం బలహీనపడింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check : శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేయలేదా..?
ఆగష్టు 15న భారత్ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. దేశం లోని పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. సామాజిక మాధ్యమాల్లో జాతీయ జెండాను ఎగురవేసిన పలు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వరంగల్ ఎందుకు మునిగింది? పాపం ఎవరిది?
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం ఏమైనా ఉందంటే అది వరంగల్ మాత్రమే. హైదరాబాద్ మాదిరే వరంగల్ సైతం జంట నగరాలే. వరంగల్.. హన్మకొండ పేరుతో చెట్టాపట్టాలేసుకున్న ఈ నగరం.. తాజాగా కురిసిన భారీ వర్షాలకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు
ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లతాపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు పెట్టారని, వనస్థలిపురంకు చెందిన గోపికృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పిల్లల పాలిట మరోసారి తన మంచి మనసును చాటుకున్న‘సోను సూద్’
కష్టాల్లో ఉన్నవారి పాలిట దేవుడిగా మారాడు నటుడు సోను సూద్. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కూలీలకు సహాయం చేసి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఎక్కడ సమస్య, సాయం పేరు విన్న వెంటనే స్పందిస్తూ చేయూతనందిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ యాక్సిడెంట్ మిగిల్చిన నష్టం 30కోట్లు.. అంత ఖరీదైన కార్లా..?
ఖరీదైన కార్లు.. భారీ యాక్సిడెంట్.. ఆ కార్లకు అయిన డ్యామేజ్ లకు ఎంత ఖర్చు అవుతుందని చెబుతున్నారో తెలుసా..? నాలుగు మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 30కోట్ల రూపాయలు (Bugatti Chiron were all involved in a car crash in Switzerland that caused damages worth 30 cr million) . ఈ యాక్సిడెంట్ స్విజర్లాండ్ లోని .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా.. ఐసీయూలో చికిత్స..!
కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అమిత్ షా.. సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి