ఆ యాక్సిడెంట్ మిగిల్చిన నష్టం 30కోట్లు.. అంత ఖరీదైన కార్లా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 8:59 AM GMT
ఆ యాక్సిడెంట్ మిగిల్చిన నష్టం 30కోట్లు.. అంత ఖరీదైన కార్లా..?

ఖరీదైన కార్లు.. భారీ యాక్సిడెంట్.. ఆ కార్లకు అయిన డ్యామేజ్ లకు ఎంత ఖర్చు అవుతుందని చెబుతున్నారో తెలుసా..? నాలుగు మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 30కోట్ల రూపాయలు (Bugatti Chiron were all involved in a car crash in Switzerland that caused damages worth 30 cr million) . ఈ యాక్సిడెంట్ స్విజర్లాండ్ లోని ఆల్ఫ్ పర్వతశ్రేణుల వద్ద చోటుచేసుకుంది. మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్ వేగన్, పోర్షే 911 కాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని ఈ ప్రమాదం కారణంగా నాలుగు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని కాంటన్ యురి పోలీసులు తమ స్టేట్మెంట్ లో తెలిపారు.

గోత్ హార్డ్ పాస్ వద్ద మెర్సిడెజ్ బెంజ్ కారు వెళుతూ ఉండగా.. ఆ కారు వెనుకనే బుగాటి, పోర్షే కార్లు వెళుతూ ఉన్నాయి. బెంజ్ కారును ఓవర్ టేక్ చేయాలని పోర్షే 911 కాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకటేసారి ప్రయత్నించాయి. ఆ సమయంలో బుగాటి మెర్సిడెజ్ బెంజ్ ను తాకగా.. పోర్షే కారును తగిలింది. దీంతో వాహనాల ముందు భాగాలు బాగా దెబ్బతిన్నాయి. 3.7 మిలియన్ల ఫ్రాంక్స్ ల నష్టం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ కారణంగా గోత్ హార్డ్ పాస్ ను తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు.

కార్ బజ్ సంస్థ కథనం ప్రకారం పోర్షే కారుకు ఎక్కువ నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ముందున్న బంపర్, హుడ్ బాగా డ్యామేజ్ జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. మెర్సిడెజ్ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి గాయాలవ్వడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

Next Story