అనెబెల్లే పగబట్టిందా..?

By మధుసూదనరావు రామదుర్గం  Published on  15 Aug 2020 2:57 AM GMT
అనెబెల్లే పగబట్టిందా..?

చూడ్డానికి వినడానికి మీకిది నాన్‌సెన్స్‌గా అనిపించవచ్చు. కానీ క సీత కష్టాలుసీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్టు భయపడే వారి కష్టాలు వారివే! అదేదో ఒక బొమ్మంట..అది పగబడుతుందంటా.. జనాలకు ఇక దిబిడే దిబిదంటా ఎవరన్నా నమ్ముతారా అసలు అంటే.. నమ్ముతారు బాస్‌ భయంతో సహజీవనం చేసే వారు తప్పకుండా నమ్మితీరుతారు. సమస్త భయాగ్రేసులారా.. అలెబెల్లె బైటికి వచ్చిందంట.. దాని కతేందో చూడండి మరి!

చూడటానికి ముద్దుగా బొద్దుగా కనిపించే అనెబెల్లే గురించి తలచుకుంటేనే గుండెదడపుడుతుంది. ఈ భయంకరమైన బొమ్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అనెబెల్లే సీరీస్‌లో ఈ బొమ్మ ఎవరికీ హాని తలబెట్టకుండా ఓ మ్యూజియంలోని అద్దపు గదిలో బంధిస్తారు. రెండు కళ్ళుపైకి తేలి వికృతంగా అతి భయానకంగా కనిపించే ఓ దెయ్యం బొమ్మ కతే అనెబెల్లే సీరీస్‌1970లో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఈ బొమ్మను గిఫ్ట్‌గా అందుకుంది. అతీంద్రియ శక్తులున్న ఈ బొమ్మ వల్ల ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయి. ఇది గమనించి అమెరికాలోని కనెక్టికట్‌లో వారెన్స్‌ ఆక్లట్‌ మ్యూజియమ్‌లో బంధించారు.

మరి అది మ్యూజియమ్‌లో ఉంది కదా మళ్ళీ ఈ రచ్చ చర్చ ఎందుకంటే.. అది అక్కడ్నుంచి తప్పించుకుందని తాజా పుకారు. అనెబెల్లే అక్కడ్నుంచి మాయమైందని తెలిసిన మరుక్షణం చాలా మందిలో భయాందోళనలు పెరిగాయి. ఇంతకాలం తనను బంధించినందుకు అది చాలా ఉగ్రంగా ఆగ్రహంతో ఉందని, ఎవరినీ వదిలిపెట్టదని నెటిజన్లు భీతిల్లిపోతున్నారు. ఇక ఆ బొమ్మలోని ఆత్మ ఎంతమందిని వెంటాడు తుందో.. ఎంతమందిని వేటాడదుతోందో అని గజగజ వణకి పోతున్నారు.

ఇదే నిజమైతే 2020లో ఇంతకన్నా ఉత్పాతం మరోటి ఉండదని ఇంకొందరు అంటున్నారు. ఆ అది బైటికి వస్తే మాత్రం ఏముంది? ప్రస్తుత పరిస్థితులు చూసి తలదించుకుని లోపలికి పరిగెడుతుందని కొందరు జోకుతున్నారు. ఇంతకూ ఆ బొమ్మ ఉందా? లేదా మాయమైందా అని కదా మీ సందేహం.. ఆగండాగండి మీరు అనసవరంగా బీపీలు పెంచుకోనక్కర్లేదు. మ్యూజియంలో అనెబెల్లా ఉంది. మరి ఏంటీ గందరగోళం అంటారా? అదంతే బాస్‌ ఎవడో పొగ లేపాడు.. అది కాస్త అందరిలో పాకింది అంతే!

Next Story