పిల్లల పాలిట మరోసారి తన మంచి మనసును చాటుకున్న‘సోను సూద్’

By సుభాష్  Published on  18 Aug 2020 12:30 AM GMT
పిల్లల పాలిట మరోసారి తన మంచి మనసును చాటుకున్న‘సోను సూద్’

కష్టాల్లో ఉన్నవారి పాలిట దేవుడిగా మారాడు నటుడు సోను సూద్‌. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది వలస కూలీలకు సహాయం చేసి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఎక్కడ సమస్య, సాయం పేరు విన్న వెంటనే స్పందిస్తూ చేయూతనందిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా సోను సూద్‌కు సోషల్‌ మీడియా వేదిక విన్నవించుకున్నారు. తాజాగా ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి చెందిన 39 మంది చిన్నారులకు కొత్త జీవితం అందించేందుకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు.

చిన్నారులకు కాలేయం మార్పిడి చికిత్స కోసం తనవంతు సాయం అందించి వారికి దేవుడిగా మారాడు. అయితే ఆ చిన్నారులకు న్యూఢిల్లీలో కాలేయ మార్పిడి చికిత్స చేయించడానికి ఇంతకు ముందు ఓ సంస్థ ముందుకు వచ్చింది. కానీ కరోనా కారణంగా ఆ చిన్నారుల విమాన ప్రయాణం ఆగిపోయింది. విషయం తెలుసుకున్న సోను సూద్‌ ఆ చిన్నారులు రెండు రోజుల్లో భారత్‌కు వచ్చేలా చేస్తానని ట్వీట్‌ చేశారు.

ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన 39 మంది చిన్నారులకు కాలేయం దెబ్బతినడంతో చికిత్స అవసరం ఏర్పడింది. వీరంతా కూడా 1 నుంచి 5 సంవత్సరాల వయస్సున్న చిన్నారులే. ఈ పిల్లలను కాలేయం మార్పిడి కోసం మనీలా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. నిజమైన హీరో సోను సూద్‌ కృషితో ఈ పిల్లలు ప్రత్యేక విమానంలో రెండు రోజుల ముందు భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో వారికి అపోలో, ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రుల్లో కాలేయ మార్పడి జగనుంది. సోను సూద్‌ లాంటి వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఏదేమైనా కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ నిజమైన దేవుడిగా మారాడు.

Next Story