యాంకర్‌ ప్రదీప్‌ మరో రికార్డు

By సుభాష్  Published on  16 Aug 2020 9:57 AM GMT
యాంకర్‌ ప్రదీప్‌ మరో రికార్డు

బుల్లితెర యాంకర్‌ తెలుగు టీవీ తెరపై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరో వైపు వెండితెరపై కనిపించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పటి వరకు ప్రదీప్‌ చేసిన షోలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఒక్క 'పెళ్లి చూపులు' మాత్రమే ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసినా మిగతావన్ని ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు హీరోగా ప్రమోషన్ పొందాడు. యాంకర్‌గా చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్‌.. ఇప్పుడు హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ముందుకొచ్చాడు. కరోనా లేకపోతే ఈపాటికే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేది. తాజాగా ప్రదీప్‌ సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డును తొలి సినిమా విడుదల కాకముందే సొంతం చేసుకున్నాడు.

Neeli Neeli Akasam 1

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కంటే హీరోగా మరో సినిమా చేసినా.. ఈ సినిమా విడుదల కాలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీని మున్నా అనే కుర్రాడు డైరెక్ట్‌ చేశాడు. ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ మూవీలో 'నీలి నీలి ఆకాశం' అనే పాట యూట్యూబ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్‌ దక్కించుకున్న ఈ పాట తాజాగా యూట్యూబ్‌ 200 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. సౌతిండియాలో ఒక హీరో నటించిన ఓ పాట.. సినిమా విడుదల కాకముందే ఈ రికార్డు సృష్టించింది. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌, సునీత పాడారు. ఒక యాంకర్‌ నటించిన పాట.. మూవీ విడుదల కాకముందే ఇంతటి రేంజ్‌లో వ్యూస్‌ దక్కించుకోవడం గమనార్హం.

Neeli Neeli Akasam 2

Next Story