ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా.. ఐసీయూలో చికిత్స..!

By సుభాష్  Published on  18 Aug 2020 5:34 AM GMT
ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా.. ఐసీయూలో చికిత్స..!

కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అమిత్‌ షా.. సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌ షాకు ఈనెల 2న కరోనా సోకగా, 14వ తేదీన కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో 12 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

అమిత్‌ షా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రన్‌దీప్‌ గులేరియా నేతృత్వంలో వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఎయిమ్స్‌ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది.

Next Story
Share it