న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  23 Sep 2020 12:21 PM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై అత్యాచారం కేసు

ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటి పాయల్‌ ఘోష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నటిపాయల్‌ ఘోష్‌ తనలాయర్‌ నితిన్‌ సాత్పుటేతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.రఫెల్‌ను‌ నడిపే తొలి మహిళా పైలట్ ఎవరంటే..?

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక‌ రఫేల్‌ ఫైటర్‌ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. త్వరలో అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ ‘గోల్డెన్ యారో‌స్‌’లో భాగం కానున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.ప్రకంపనలు సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. అటు టాలీవుడ్‌లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్‌ కేసులో రకూల్‌, నమ్రత పేర్లు బయటకు రావడంతో టాలీవుడ్‌ సెలబ్రిటీల్లో అలజడి మొదలైంది. అయితే టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు వివరాలను కూడా ఎన్‌సీబీ తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల వివరాలు కూడా ఎక్సైజ్‌ శాఖ నుంచి ఎన్‌సీబీ తీసుకుంది. కాగా, టాలీవుడ్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.వారు అలానే చేస్తున్నారా.? : మ‌ంత్రి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల డిక్లరేషన్‌ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు చేసిన డిమాండ్‌పై మంత్రి స్పందించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్‌

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్‌-4 కొనసాగుతోంది. మరో వైపు ఈ షోలో కుమార్‌ సాయి, అవినాష్‌లు వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు మరో ఎలిమినేషన్‌ రంగం సిద్ధమవుతోంది. ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌ కూడా పూర్తయ్యాయి..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.గంటా శ్రీనివాస్‌ వైసీపీలో చేరేది అప్పుడేనా..?

ఏపీ టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. ఎప్పటి నుంచో వైసీపీలో చేరుతారన్న పుకార్లు కొన్ని రోజులుగా సైలెంట్‌ కాగా, వైసీపీలో చేరుతారన్న వార్తలు మళ్లీ గుప్పుమంటున్నాయి. అయితే గంటా శ్రీనివాస్‌ కనుక వైసీపీలో చేరితో అతి పెద్ద వార్తే అవుతుంది. అక్టోబర్‌ నెలలో గంటా శ్రీనివాస్‌ వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.మల్కాజిగిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు

తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబి) దాడులు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతుండటంతో ఏసీబీ కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా తెలంగాణలోని మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచే సో దాలు నిర్వహిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.సుశాంత్‌ ఆ సినిమాకి రూ.12కోట్లు డిమాండ్‌ చేసాడట

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు పలు ములపులు తిరుగుతోంది. సుశాంత్ మరణం తరువాత డ్రగ్స్‌ కోణం బయటకు రావడంతో ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేశారు ఎన్‌సీబీ అధికారులు. సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతి ఒక్కర్నీ ఎన్‌సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాని రెండు రోజుల పాటు అధికారులు విచారణ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.15 రోజుల్లోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

5 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వివరాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో నమోదు కాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌ ప్లాట్స్‌, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ వందశాతం పూర్తి చేయాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ప్రాక్టీస్‌ లేకనే.. లోయర్‌ ఆర్డర్‌లో ధోని

కరోనా కారణంగా ఐపీఎల్‌ ఈ సారి ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి క్రికెట్‌ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతోంది. చెన్నై జట్టు మాత్రమే ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ముంబైతో మ్యాచ్‌లో గెలవగా.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తన కంటే ముందుగా ఆల్‌రౌండర్లు సామ్‌కరణ్‌, రవీంద్ర జడేజాలను ముందుగా పంపించాడు. తొలి మ్యాచ్‌లో ఈ వ్యూహం ఫలించినా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story