15 రోజుల్లోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  23 Sep 2020 6:29 AM GMT
15 రోజుల్లోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వివరాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో నమోదు కాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌ ప్లాట్స్‌, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ వందశాతం పూర్తి చేయాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్‌, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ, కార్యదర్శి సందీప్‌ కుమార్ సుల్తానియా, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story