కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

By సుభాష్  Published on  22 Sep 2020 8:52 AM GMT
కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు ఇతర బిల్లులు చట్ట రూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతోపాటు మొత్తం 12 బిల్లులకు గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ హక్కులు-పాసు పుస్తకాలు, వీఆర్‌వోల రద్దు, టీఎస్‌ బీపాస్‌, పురపాలక, పంచాయతీరాజ్‌, ప్రైవేటు వర్సిటీలు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ విపత్తు అలాగే తెలంగాణ ఉద్యోగుల పదవీ విమరణ వయసు క్రమబద్దీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్స్‌బులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ న్యాయ స్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లుతోపాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ బిల్లులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

Next Story
Share it