ఏపీ టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. ఎప్పటి నుంచో వైసీపీలో చేరుతారన్న పుకార్లు కొన్ని రోజులుగా సైలెంట్‌ కాగా, వైసీపీలో చేరుతారన్న వార్తలు మళ్లీ గుప్పుమంటున్నాయి. అయితే గంటా శ్రీనివాస్‌ కనుక వైసీపీలో చేరితో అతి పెద్ద వార్తే అవుతుంది. అక్టోబర్‌ నెలలో గంటా శ్రీనివాస్‌ వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఆ నెలలో మంచి ముహూర్తాలున్నాయని, అందుకే ఆ నెలలోనే వైసీపీ కండువా కప్పుకుంటే బాగుంటుందని గంటా లెక్కలేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గంటా కనుక జగన్‌ పార్టీలో చేరిపోతే విశాఖలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మిగిలిపోతారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గంటాపై వైసీపీ ప్రయత్నాలు
మరోవైపు గంటా శ్రీనివాస్‌ను రప్పించేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు గంటాకు వైసీపీ మంత్రి బోత్స సత్యనారాయణతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే టీడీపీకి విశాఖ మొత్తానికి మిగిలేది ఒక్క వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రమేనని అంటున్నారు. మొదటి వికెట్‌ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి బాబు కూడా వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక వచ్చే నెలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తన ప్రియ శిష్యుడు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబును తీసుకుని వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. అయితే నిజానికి వాసపల్లి కూడా గంటా శ్రీనివాస్‌తో రావాల్సి ఉంది. గంటా వైసీపీలో చేరే విషయంలో వైసీపీలో కొన్ని భేదాలు ఉన్నట్లు, అందుకే ఆయన ఎప్పుడు వచ్చేది అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. అలాగే వాసుపల్లి తనకు తానుగా విజయసాయిరెడ్డితో టాచ్‌లో ఉంటూ ఫ్యాన్‌ నీడలో చేరాలనుకున్నారు.

గంటాను అనుసరిస్తున్న గణబాబు
ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన గణబాబు ఒక్కరే గంటా శ్రీనివాస్‌ను అనుసరిస్తున్నారు. ఆయన కూడా వైసీపీలోకి రావాల్సి ఉంది. రాజకీయాల్లో పేరొందిన నాయకుడిగా ఉన్న గణబాబు రెండు దశాబ్దాలుగా విశాఖ విశాఖ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో గంటా శ్రీనివాస్‌తో కలిసి ప్రజారాజ్యంలోకి కూడా వెళ్లి వచ్చారు. అలాగే తన నియోజకవర్గంలో గ్యాస్‌ లీక్‌ అయిన 15 మంది వరకు చనిపోతే చంద్రబాబు కానీ, లోకేష్‌ కానీ రాకపోవడం పట్ల గణబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఇప్పుడే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఒక వేళ గంటా వైసీపీలో చేరినట్లయితే విశాఖలో టీడీపీ గ్రాఫ్‌ పడిపోవడం ఖాయమని రాజకీయ నాయకులు అంటున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort