హిందూ మత విశ్వాసాలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి దేవుళ్లను కించపరుస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అన్యమతాలకు చెందిన వారు ఆలయంలో సంతకం పెట్టకపోతే గుడి అపవిత్రం అవుతుందా అని ఆయన ప్రశ్నించడం దారుణమని అన్నారు.

సమాజంలో మత సామరస్యం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను అవమానపర్చడమేనని ఆరోపించారు. మంత్రిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంత్రి నాని మానుకోవాలని అన్నారు. మంత్రిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నానికి వ్యతిరేకంగా బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సుభాష్

.

Next Story