వారు అలానే చేస్తున్నారా.? : మ‌ంత్రి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2020 11:15 AM GMT
వారు అలానే చేస్తున్నారా.? : మ‌ంత్రి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల డిక్లరేషన్‌ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు చేసిన డిమాండ్‌పై మంత్రి స్పందించారు.

పది మందిని వెంటబెట్టుకెళ్లి అమిత్‌షా, కిషన్‌రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాటలు హాస్యాస్పదమ‌ని.. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా? ఉందా అని ప్ర‌శ్నించారు.

అలాగే.. సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్రధాని మోదీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్‌ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయని మంత్రి నాని అన్నారు.

ఇక‌.. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకే.. ఆలయాలపై దాడులు జరిగాయంటే ఆయన్ను తొలగిస్తారా? నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలనే దానిపై బీజేపీ ఆలోచించుకోవాలని.. అంతేకానీ మా పార్టీలో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనే విషయాలను జగన్‌కు బీజేపీ నేతలు చెప్ప‌డ‌మేంట‌ని.? ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదంటూ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story