ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయాలని సీఎం జగన్‌ కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలున్నారు.

కాగా, 2021లో డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. మంగళవారం సాయంత్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన జగన్‌.. అమిత్‌ షా ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు, చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సుభాష్

.

Next Story