మల్కాజిగిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు

By సుభాష్  Published on  23 Sep 2020 7:08 AM GMT
మల్కాజిగిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు

తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబి) దాడులు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతుండటంతో ఏసీబీ కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా తెలంగాణలోని మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచే సో దాలు నిర్వహిస్తోంది.

సీపీ నర్సింహారెడ్డి ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సైతం భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తనిఖీలు కొనసాగిస్తోంది. ఏకకాలంలో అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20 చోట్ల, వరంగల్‌ జిల్లాల్లో మూడు చోట్ల, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్‌ సీఐగా పని చేశారు. ఆ సమయంలో పలు భూవివాదాల్లో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

Next Story