బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్‌

By సుభాష్  Published on  23 Sep 2020 8:54 AM GMT
బిగ్‌బాస్‌-4లో మరో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్‌

తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది. మొదటి మూడు సీజన్లు ముగించుకుని ఇప్పుడు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌-4 ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. దేశంలో అత్యధికంగా రేటింగ్‌తో దూసుకెళ్తుంది. హీరో నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్‌-4 కొనసాగుతోంది. మరో వైపు ఈ షోలో కుమార్‌ సాయి, అవినాష్‌లు వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు మరో ఎలిమినేషన్‌ రంగం సిద్ధమవుతోంది. ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌ కూడా పూర్తయ్యాయి.

అయితే తాజాగా సమాచారం ప్రకారం.. మూడో వారం ఎలిమినేషన్‌ పూర్తి కాగానే మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఉంటుందట. ఈ వైల్డ్‌కార్డు ద్వారా ఓ హీరోయిన్‌ని బాగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపబోతున్నారు నిర్వాహకులు. ఆ వైల్‌ కార్డు కంటెస్టెంట్‌ హీరోయిన్‌ స్వాతి దీక్షత్‌. 'బ్రేకప్‌,లేడీస్‌ అండ్ జెంటిల్‌మేన్‌, జంప్‌ జిలానీ, చిత్రాంగద వంటి సినిమాల్లో నటించారు. ఈమె తమిళ, బంగాలీ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవి లేవు. అదే సమయంలో బిగ్‌బాస్‌-4 ఆఫర్‌ రావడంతో స్వాతి దీక్షిత్‌ బిగ్‌బాస్‌ హౌస్‌కి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Bigg Boss Wild Card Entry1

Next Story