న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  4 July 2020 3:49 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

కొత్త టెన్షన్.. కరోనాలో మార్పులు.. పుట్టుకొస్తున్న కొత్త రకం వైరస్‌

కోవిడ్‌కు కారణమయ్యే సార్స్‌ కోవ్‌-2 వైరస్‌లో మార్పుల కారణంగా ‘డీ614జీ’ అనే కొత్తరకం వైరస్‌ పొట్టుకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోవిడ్‌ కారక ‘సార్స్‌ కోవ్‌ 2’ వైరస్‌ జన్యక్రమంలో మార్పు చోటు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్తరకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్‌ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందంటున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దేశంలో కరోనా కరాళనృత్యం.. 24గంటల్లో 22,771 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 19వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,771 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 442 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,48,315కు చేరగా.. 18,655 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3,94,227 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,35,433 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పురావస్తు శాఖ కీలక నిర్ణయం.. 6 నుంచి గోల్కొండ, చార్మినార్‌ సందర్శించొచ్చు

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా పర్యాటకులు లేక గోల్కొండ, చార్మినార్‌ వంటి పర్యాటక ప్రదేశాలు బోసిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం పర్యాటక సందర్శనకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి గోల్కొండ, చార్మినార్‌లోకి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వ్యాక్సిన్ క్లినికల్ టెస్టింగ్ లో సామాన్యులకు ఛాన్స్.. ఎలానంటే?

ఆగస్టు పదిహేను నాటికి దేశీయ వ్యాక్సిన్ ను విడుదల చేయాలన్న పట్టుదలలో ఐసీఎంఆర్ తో పాటు.. సదరు వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ కు క్లినికల్ టెస్టులు చేయటానికి దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేశారు. సాధారణంగా క్లినికల్ టెస్టులు మూడు దశల్లో చేస్తారు. సమయం తక్కువగా ఉండటం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రజలు కరోనాతో సహజీవనం చేయడం అలవాటు చేసుకోవాలి.. ట్రంప్‌ కొత్త ప్రచారం

కరోనా మహమ్మారిని ఇప్పట్లో వదిలించుకోలేమని, జీవితాంతం దాంతో సాహసం చేయాల్సి ఉంటుందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుండగా, ఈ విషయం అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు ఆలస్యంగా అర్థమైనట్లుంది. తమదేశంలోకి కరోనా రాదని, ఒక వేళ వచ్చిందని ఎలాంటి సమయంలోనైనా ఎదుర్కొనే సత్తా ఉందని ఎంతో ప్రగల్భాలు పలికిన ట్రంప్‌.. కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అమెరికాను సైతం కరోనా అతాలాకుతలం చేస్తోంది. తీవ్రస్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వామ్మో.. ఇంత ఖరీదైన మాస్కా.. అక్షరాల రూ.2.89 లక్షలు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు మాస్కులు ధరిస్తున్నారు. కరోనా పుణ్యమా అని.. మాస్కుల ధరలు కూడా అమాంతంగా పెంచేశారు. దీంతో మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని మాస్కులు మార్కెట్లో రూ.30 నుంచి వేలల్లో లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు మాస్క్‌లు ధరించని వారు ఇప్పుడు తప్పకుండా ధరించాల్సి వస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహిళను తన కారుతో ఢీకొట్టిన పోలీసు.. ప్రజలు ఏమైనా చేస్తారేమో అని భయపడి.!

న్యూఢిల్లీ: ఓ మహిళను పోలీసు ఆఫీసరు కారుతో ఢీ కొట్టాడు. ఆమెకు కనీసం ఏమైందో అని కూడా చూడకుండా అక్కడి వాళ్లు ఏమి చేస్తారో అని భయపడి తిరిగి అదే కారును ఆ మహిళ మీద నుండి పోనించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 56 సంవత్సరాల పోలీసు ఆఫీసర్ ఈ ఘటన వెనుక ఉన్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టాలీవుడ్‌లో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

వెండి తెర, బుల్లితెర నటులు, నిర్మాతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవలే నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కు కరోనా వైరస్ సోకగా..ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా బుల్లితెర హీరో రవికృష్ణ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. స్టార్ మా లో ప్రసారమయ్యే ఆమెకథ సీరియల్ లో రవికృష్ణ సరసన నటిస్తోన్న నవ్యస్వామి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : 20 మంది భారత సైనికులు మరణించారని పాక్, చైనా సైనికులు డ్యాన్స్ చేశారా..?

గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న గొడవల కారణంగా ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా మరణించారు. మరణించిన భారత సైనికుల సంఖ్య 21కి చేరింది. కానీ చైనా మాత్రం ఈ ఘటనపై నోరు విప్పడం లేదు. ఇకపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని ఇరు దేశాల ఉన్నతాధికారులు తమ తమ బృందాలకు సూచనలు జారీ చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : తాజాగా తెలుగును రెండో ఉత్తమ లిపిగా గుర్తించారా..?

ద్రావిడ భాషల్లో తెలుగును ఎక్కువగా మాట్లాడతారనేది తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార భాషగా గుర్తింపు పొందింది. ఇతర దేశాల్లో కూడా తెలుగు భాషను బాగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. తెలుగు అక్షరాలకు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ రెండో ఉత్తమ లిపిగా తెలుగును గుర్తించారు అంటూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story