కొత్త టెన్షన్.. కరోనాలో మార్పులు.. పుట్టుకొస్తున్న కొత్త రకం వైరస్‌

By సుభాష్  Published on  4 July 2020 5:35 AM GMT
కొత్త టెన్షన్.. కరోనాలో మార్పులు.. పుట్టుకొస్తున్న కొత్త రకం వైరస్‌

కోవిడ్‌కు కారణమయ్యే సార్స్‌ కోవ్‌-2 వైరస్‌లో మార్పుల కారణంగా 'డీ614జీ' అనే కొత్తరకం వైరస్‌ పొట్టుకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోవిడ్‌ కారక 'సార్స్‌ కోవ్‌ 2' వైరస్‌ జన్యక్రమంలో మార్పు చోటు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్తరకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్‌ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైరస్‌లలో ఇది కొత్తరకం వైరస్‌ అని, దీని ప్రభావం చాలా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ వైరస్‌ సంక్రమణ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

డీ614జీ వైరస్‌ గురించి ఏప్రిల్‌ నెల మొదటి వారంలో మాకు తెలిసిందని, ప్రపంచ వ్యాప్తంగా డీ614జీ రకం వైరస్‌తో పరిస్థితి తారుమారు అవుతోందని, ఇప్పుడున్న వైరస్‌లలో డీ614జీ ఎక్కువగా ఎఫెక్ట్‌ చూపుతోందని బెటె కోర్బర్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు

ఈ వైరస్‌ స్వల్ప మార్పులు చెందినప్పటికీ అది చాలా సమర్థవంతమైనదని తెలిపారు. అయితే ఈ వైరస్‌ శరీరంపై కొమ్ములు లాంటి నిర్మాణాలు ఏర్పడతాయని, ఇది మనవ శరీరంలోకి దూసుకుపోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ వైరస్‌పై పొరల్లో ఉండే కొమ్ము లాంటి 'స్పైక్‌ ప్రొటిన్‌'లో ఈ మార్పు జరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అయితే శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్‌ ప్రభావం చాలా ఉంటుందని, దీని వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వైరస్‌పై మరింత పరిశోధన జరగాల్సి ఉందని బెటె కోర్బర్‌ అభిప్రాయపడ్డారు.

Next Story
Share it