Fact Check : 20 మంది భారత సైనికులు మరణించారని పాక్, చైనా సైనికులు డ్యాన్స్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 July 2020 8:04 AM GMT
Fact Check : 20 మంది భారత సైనికులు మరణించారని పాక్, చైనా సైనికులు డ్యాన్స్ చేశారా..?

గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న గొడవల కారణంగా ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా మరణించారు. మరణించిన భారత సైనికుల సంఖ్య 21కి చేరింది. కానీ చైనా మాత్రం ఈ ఘటనపై నోరు విప్పడం లేదు. ఇకపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని ఇరు దేశాల ఉన్నతాధికారులు తమ తమ బృందాలకు సూచనలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో భారత్ కు చెందిన సైనికులు మరణించారన్న ఆనందంలో పాకిస్థాన్-చైనా సైనికులు డ్యాన్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ యూజర్ Bhushan Lal Koul ఓ వీడియోను షేర్ చేశాడు. “#China #Pakistan both R dancing across the #border after brutally #killing 20 #Indian #soldiers. India is not as India as 1962. Soon both of you will regret it. “How’s the josh”!!! I said “How’s the josh”!!” అంటూ వీడియోను షేర్ చేశాడు. "చైనా పాకిస్థాన్ సైనికులు బోర్డర్ లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. భారత్ 1962 లో లాగా లేదు.. మీరు తప్పకుండా బాధపడతారు" అని తన ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చాడు.

చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సిజిటిఎన్) న్యూస్ ప్రొడ్యూసర్ అంటూ ఉన్న Shen Swei ప్రొఫైల్ లో కూడా ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ‘Dancing Time’(డ్యాన్సింగ్ టైమ్) అనే క్యాప్షన్ ను ఉంచాడు. గల్వాన్ లోయలో జూన్ 16న భారత్-చైనా సైనికుల మధ్య గొడవ చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో కూడా పలువురు ఈ వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని, అలాగే కీ వర్డ్స్ ‘Pakistan and China army celebrations’ ను ఉపయోగించి సెర్చ్ చేయగా ‘Amyn Yar Baig’ అనే యూట్యూబ్ ఛానల్ లో నవంబర్, 2018లో ఈ వీడియోను పోస్టు చేశారు. “#Pakistan and #China Soldiers are #Dance on Khunjrab #CPEC #Army #hunza #gilgitbaltistan” అనే టైటిల్ ను వీడియోకు ఉంచారు. పాకిస్థాన్, చైనా సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియో అని అందులో తెలిపారు.

మరిన్ని సెర్చ్ రిజల్ట్స్ లో ట్రావెల్ వ్లాగర్ అయిన Jojo Aigner యూట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియో లభించింది. ఈ వీడియోను జోజో తీశాడు. మొత్తం 25 నిమిషాల వీడియో ఇది.. పాకిస్థాన్ బోర్డర్ లో నుండి చైనాకు వెళుతున్న సమయంలో ఈ వీడియోను షూట్ చేశాడు. జోజో టర్కీ, ఇరాన్, పాకిస్థాన్ నుండి చైనాకు చేరుకున్నదాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు.

A1

ఈ వీడియో నుండి వైరల్ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోలో 8:30 నిమిషాల నుండి 9:26 నిమిషాల మధ్య జరిగిన సన్నివేశాలను ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో పాకిస్థాన్, చైనా సైనికులు ఫ్రెండ్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.

భారత సైనికులు 20 మంది చనిపోయారని ఆనందంతో పాక్-చైనా సైనికులు డ్యాన్స్ చేశారన్న వీడియో 'పచ్చి అబద్దం'.

Next Story