కరోనా మహమ్మారిని ఇప్పట్లో వదిలించుకోలేమని, జీవితాంతం దాంతో సాహసం చేయాల్సి ఉంటుందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుండగా, ఈ విషయం అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు ఆలస్యంగా అర్థమైనట్లుంది. తమదేశంలోకి కరోనా రాదని, ఒక వేళ వచ్చిందని ఎలాంటి సమయంలోనైనా ఎదుర్కొనే సత్తా ఉందని ఎంతో ప్రగల్భాలు పలికిన ట్రంప్‌.. కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అమెరికాను సైతం కరోనా అతాలాకుతలం చేస్తోంది. తీవ్రస్థాయిలో కరోనా  కేసులు పెరిగిపోతున్నాయి. కానీ కరోనా ఇప్పట్లో వదిలిపోదని అంటూ మన దారిలోకి వచ్చాడు. కరోనాతో కలిసి జీవితంచక తప్పదని చెప్పుకొచ్చాడు. ప్రజలు కరోనాతో సహజీవం చేయడం అలవాటు చేసుకోవాలనే ప్రచారం వైట్‌హౌస్‌లో ప్రారంభించారు.

సోమవారం నుంచి ఈ ప్రచారం జోరందుకోనుంది. ఇందు కోసం ఏం చేయాలి..? ప్రజలు కరోనాతో సహజీవనం చేయడం ఎలా..? అనే అంశంపై ప్రచారం చేసేందుకు వైట్‌ హౌస్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ప్రజలు కరోనా ఉన్నా.. బతకడం నేర్చుకోవాలి. ఎన్నికల్లో పాల్గొనాలి. అలా వారిని ప్రిపేర్‌ చేయడమే వైట్‌ హౌస్‌ వర్గాల లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే వైట్‌ హౌస్‌ జనవరిలో వైరస్‌ మనల్ని ఏమి చేయ్యలేదు. డోంట్‌ వర్రీ అనే నినాదాన్ని ప్రచారం చేసి.. తాజాగా రూటు మార్చడం గమనార్హం.

అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు రెట్టింపు

ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి దారుణంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.  దేశంలో కరోనా వల్ల అధిక శాతం నష్టపోయే దేశం అమెరికాగా మారుతోంది. ఇక ట్రంప్‌ చుట్టున్నవాళ్లు కూడా కరోనా గురించి టెన్షన్‌ వద్దు సార్‌.. మనకు చాలా మందులు బాగా పని చేస్తున్నాయి.. వ్యాక్సిన్‌ కూడా వచ్చేస్తోంది.. డోంట్‌ వర్రీ.. అని చెబుతుంటే ట్రంప్‌ కూడా అదే బాటలో వెళ్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ సారి ఎన్నికల్లో గెలవడం కష్టమే..

ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌ గెలవడం కష్టమేనన్న టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు కరోనా మాత్రమే కారణం కాదు.. ట్రంప్‌ తీసుకుంటున్న పలు నిర్ణయాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటవల అమెరికాలో జరిగిన నల్లజాతి ఉద్యమం ట్రంప్‌కు వ్యతిరేకంగా మారింది. చాలా మంది తెల్ల జాతీయులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇక వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులు, అమెరికాలోని విదేశీయులు ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక పరిస్థితి ట్రంప్‌ వచ్చాక మరింత దారుణంగా తయారైంది. ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలే కొంపముంచేలా కనిపిస్తోందని అంటున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet