చైనాకు మరో షాక్‌.. విచారణ కోరిన 29 దేశాలు

By సుభాష్  Published on  1 July 2020 7:24 AM GMT
చైనాకు మరో షాక్‌.. విచారణ కోరిన 29 దేశాలు

చైనాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. చైనాలో ఉగిర్‌ ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా సహా 29 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కులకు సంబంధించిన బృందం దర్యాప్తు చేయాలని కోరాయి. చైనాలో పర్యటించి దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ పరిణామం చైనాకు పెద్ద సమస్యేనని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, చైనాలో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన మామూలైపోయాయని ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

ఇప్పటికే కరోనా వైరస్‌ విషయంలో చైనా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. కరోనా పుట్టకకు సంబంధంచి వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు చైనాకు పంపబోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే బృందాలు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని మే నెల నుంచి కోరుతున్నా.. అనుమతి ఇవ్వలేదు. కరోనా ఏ జంతువు నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో పట్టుబట్టింది. అది తెలుసుకుంటే వైరస్‌తో పోరాడేందుకు వీలుకలుగుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెండ్రోస్‌ అధానమ్‌ తెలిపారు. అయితే మేము పంపే బృందాలు వైరస్‌ మూలాన్ని కనుక్కుంటుందని మాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆ బృందాలు చైనాకు వెళ్లి అక్కడి వేర్వేరు ప్రాంతాల్లో కరోనా శాంపిల్స్‌ సేకరిస్తుంది. అలాగే అనుమానం ఉన్న జంతువులను సేకరించి వాటిపై పరిశోధన చేస్తుంది. వైరస్‌లో జన్యువుల వంటివి, ఇతర జంతువుల్లో ఉన్నట్లయితే ఏ జంతువు నుంచి వైరస్‌ సోకిందో తెలిసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే చైనా కుట్ర పూరితంగా వైరస్‌ను సృష్టించిందా.. అనే విషయం బట్టబయలు కానుంది.

Next Story