భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు మాస్కులు ధరిస్తున్నారు. కరోనా పుణ్యమా అని.. మాస్కుల ధరలు కూడా అమాంతంగా పెంచేశారు. దీంతో మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని మాస్కులు మార్కెట్లో రూ.30 నుంచి వేలల్లో లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు మాస్క్‌లు ధరించని వారు ఇప్పుడు  తప్పకుండా ధరించాల్సి వస్తోంది.

ఇక కొందరు ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను వాడుతున్నారు. మాస్క్‌ లేనిది బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చేశాయి. బ్రాండ్‌ను బట్టి మాస్క్ ధర ఉంటుంది. కానీ పుణెలోని పింప్రి చించ్‌వాడకు చెందిన శంకర్‌ కుర్‌హెడ్‌ అనే వ్యక్తి ధరించి మాస్కు ధర ఎంతో తెలిస్తే మీరు షాక్‌ కావాల్సిందే. అక్షరాల రూ.2 లక్షల 89 వేలు. ఈ మాస్క్‌ బంగారంతో తయారు చేయించుకున్నాడు. మాస్కు తయారీకి ఐదున్నర తులాల బంగారాన్ని వాడినట్లు తెలుస్తోంది. ఈ గోల్డ్‌ మాస్క్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శంకర్‌కు చేతులకు, మెడల్లో బంగారం అభరణాలు దగదగ మెరిసిపోతుంటాయి. అయితే బంగారం అంటే ఎంతో ఇష్టమని, ఇటీవల ఓ వ్యక్తి వెండితో తయారు చేయించిన మాస్క్‌ వాడటం సోషల్‌ మీడియాలో చూశానని, అందుకే నేను కూడా బంగారంతో తయారు చేయించిన మాస్క్‌ వాడాలనే ఆలోచన వచ్చిందని శంకర్‌ చెప్పుకొచ్చాడు.ఈ మాస్క్‌ ధరించడం వల్ల శంకర్‌ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఏది ఏమైనా కరోనా నుంచి రక్షించుకునేందుకు ఇలా బంగారంతో కూడిన మాస్క్‌ ధరించడం గమనార్హం.

Golden Mask 1

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet