మహిళను తన కారుతో ఢీకొట్టిన పోలీసు.. ప్రజలు ఏమైనా చేస్తారేమో అని భయపడి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 July 2020 9:57 AM GMT
మహిళను తన కారుతో ఢీకొట్టిన పోలీసు.. ప్రజలు ఏమైనా చేస్తారేమో అని భయపడి.!

న్యూఢిల్లీ: ఓ మహిళను పోలీసు ఆఫీసరు కారుతో ఢీ కొట్టాడు. ఆమెకు కనీసం ఏమైందో అని కూడా చూడకుండా అక్కడి వాళ్లు ఏమి చేస్తారో అని భయపడి తిరిగి అదే కారును ఆ మహిళ మీద నుండి పోనించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 56 సంవత్సరాల పోలీసు ఆఫీసర్ ఈ ఘటన వెనుక ఉన్నాడు.

ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ కారు వచ్చిన వేగానికి ఆ మహిళ బానెట్ మీద పడింది. అలా కిందకు పడిపోయింది. ఈ ఘటనను చూసిన కొందరు ఆ మహిళను లేపడానికి ప్రయతిస్తూ ఉండగా.. కారును మరోసారి స్టార్ట్ చేసి ఆ మహిళ మీద నుండి పోనిచ్చాడు. ఈ ఘటన ఘాజీపూర్ ప్రాంతం లోని చిల్లా గ్రామంలో శుక్రవారం నాడు చోటుచేసుకుంది.

పోలీసులు ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని ట్రేస్ చేయగా సబ్ ఇన్స్పెక్టర్ యోగేంద్ర ఈ పనికి బాధ్యుడు అని తేలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతడి రాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అందరూ భావిస్తున్నారు.

Next Story
Share it