Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నాను..అని బండి సంజయ్ పేర్కొన్నారు
By - Knakam Karthik |
Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. నాతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించి, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైనా సమగ్రంగా దర్యాప్తు చేయాలి.
కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలి. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను. నాతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 23, 2025