న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  13 Oct 2020 4:40 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.ఆ 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు.. ప్రకటించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

మ‌రోమారు ఎన్నిక‌ల కోలాహాలం మొద‌లైంది. కొద్ది రోజుల క్రిత‌మే దేశ‌వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాల‌కు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. తాజాగా మ‌రో ఎన్నిక‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నవంబర్ 9న రాజ్యసభలోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నన‌ట్లు భారత ఎన్నికల కమిషన్ మంగళవారం తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్ కొద్దిసేప‌టి క్రితం క‌న్నుమూశారు.‌ తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కరోనా, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గుండా మరణంతో బెల్లంప‌ల్లి, మంచిర్యాల‌లో విషాద చాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు శోక‌సంద్రంలో మునిగిపోయారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.హీరో నుంచి గ్లామర్‌ సిరీస్‌లో కొత్త మోడల్‌ బైక్‌.. అదిరిపోయే ఫీచర్స్‌

హీరో మోటోకార్ప్‌ మరో కొత్తబైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్‌లలో విజయవంతమైన మోడల్‌గా పేరు తెచ్చుకున్న గ్లామర్‌ సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. గ్లామర్‌ బ్లేజ్‌ పేరుతో వస్తోన్న ఈ కొత్త మోడల్‌ను హీరో సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్‌ షోరూమ్‌లలో గ్లామర్‌ బ్లేజ్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.భూత వైద్యం పేరుతో బాలికపై అత్యాచారం.. దేహశుద్ది చేసిన మహిళలు

భూత వైద్యం పేరుతో ఓ దొంగబాబా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటంతో మహిళలు ఆ బాబాకు దేహశుద్ది చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో ఆ దొంగబాబకు బడితపూజ చేశారు. ఈ ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌ అనే భూత వైద్యున్ని సదరు బాలిక సంప్రదించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ఆపరేషన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఆర్‌కె. మీనాను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మీనా.. గత కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్‌ శంఖ బ్రత బాగ్చి బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్సీ బెటాలియన్‌ ఐజీగా నియమించారు. బాగ్చి 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.‘రాధేశ్యామ్’ నుండి ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ చూశారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ రోజు పూజా హెగ్డే బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అభిమానుల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్ర‌భాస్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.జైల్లో గాయప‌డ్డ‌ రాగిణి.. ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సకు అవకాశం కల్పించండి

డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. జైల్లో తను జారి పడ్డానని, నడుముకు, వెన్నుకు తీవ్ర గాయాలయ్యాయని రాగిణి తన పిటీషన్‌లో పేర్కొంది. జైల్లో తనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదని ఆమె తెలిపింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.కరోనా మృతులు: వారికి రూ.5 లక్షల పరిహారం.. సీఎం జగన్‌ హామీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎందరినో పొట్టన పెట్టుకుంటోంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతో మంది ప్రాణాలు విడిచారు. వీరిలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ ముందుకొచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్‌ సీఐ

లంచాలు తీసుకుంటు ఎంతో మంది ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నా మరి కొందరి ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒక వైపు రాష్ట్రంలో లంచాలు అనేవి ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. కొందరు పెడచెవిన పెట్టి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్‌ సీఐ టాటా బాబు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన చట్టంలో కొన్ని సవరణలు చేయనున్నారు. ఈ చట్ట సవరణ ఎంఐఎంకు లబ్ది చేయడం కోసమే ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. జీహెచ్ఎంసీలో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే మించి సంతానం ఉండకూడదనే నిబంధన ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story