జైల్లో గాయపడ్డ రాగిణి.. ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సకు అవకాశం కల్పించండి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
13 Oct 2020 8:18 AM GMT

డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. జైల్లో తను జారి పడ్డానని, నడుముకు, వెన్నుకు తీవ్ర గాయాలయ్యాయని రాగిణి తన పిటీషన్‌లో పేర్కొంది.
జైల్లో తనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదని ఆమె తెలిపింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరింది. రాగిణి పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా సీసీబీ పోలీసులకు సూచించి విచారణను వాయిదా వేసింది. ఇదిలావుంటే ఈ నెల 23 వరకు రాగిణికి కోర్టు రిమాండ్ విధించింది.
Next Story