భూత వైద్యం పేరుతో బాలికపై అత్యాచారం.. దేహశుద్ది చేసిన మహిళలు

By సుభాష్  Published on  13 Oct 2020 9:23 AM GMT
భూత వైద్యం పేరుతో బాలికపై అత్యాచారం.. దేహశుద్ది చేసిన మహిళలు

భూత వైద్యం పేరుతో ఓ దొంగబాబా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటంతో మహిళలు ఆ బాబాకు దేహశుద్ది చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో ఆ దొంగబాబకు బడితపూజ చేశారు. ఈ ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌ అనే భూత వైద్యున్ని సదరు బాలిక సంప్రదించింది. సమస్య పరిష్కరిస్తానని అమాయకురాలైన బాలికను బెదిరించి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బాలికకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది.

ఈ క్రమంలో బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్థానిక మహిళలతో కలిసి బాబాను తీవ్రంగా చితకబాదారు. భూతవైద్యం పేరుతో మరి కొందరి మహిళపై కూడా కొంత కాలంగా ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అయితే గత మూడు నెలల కాలంలో 12 సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. వివరాలు చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగబాబాను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

Next Story