'రాధేశ్యామ్' నుండి ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ చూశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 8:47 AM GMT
రాధేశ్యామ్ నుండి ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ చూశారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ రోజు పూజా హెగ్డే బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అభిమానుల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్ర‌భాస్‌.

పూజా హెగ్డే బ‌ర్త్ డే సందర్భంగా 'రాధేశ్యామ్' సినిమాలో పూజ లుక్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ సినిమాలో పూజ పాత్ర పేరు ప్రేరణ అనే హింట్ ఇచ్చారు. 'మా ప్రేరణ‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించే సినిమా కావ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, ఇటు అభిమానుల‌లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైనా దీపికా పదుకొనే న‌టించ‌నుంది.

Next Story