ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

By సుభాష్  Published on  13 Oct 2020 9:41 AM GMT
ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ఆపరేషన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఆర్‌కె. మీనాను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మీనా.. గత కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్‌ శంఖ బ్రత బాగ్చి బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్సీ బెటాలియన్‌ ఐజీగా నియమించారు. బాగ్చి 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు.

గత కొంత కాలగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న 2005బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి త్రివిక్రమ్‌ వర్మను గుంటూరు రేంజ్‌ డీఐజీగా నియమించారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ డీఐజీ విజయ కుమార్‌ను బదిలీ చేశారు. ఆయనను హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఇక 2010 బ్యాచ్‌కు చెందిన సుధీర్‌ కుమార్‌ రెడ్డిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it