ఆ 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు.. ప్రకటించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2020 9:51 AM GMT
ఆ 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు.. ప్రకటించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

మ‌రోమారు ఎన్నిక‌ల కోలాహాలం మొద‌లైంది. కొద్ది రోజుల క్రిత‌మే దేశ‌వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాల‌కు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. తాజాగా మ‌రో ఎన్నిక‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నవంబర్ 9న రాజ్యసభలోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నన‌ట్లు భారత ఎన్నికల కమిషన్ మంగళవారం తెలిపింది.

మొత్తం ఖాళీల్లో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27కి నామినేషన్లకు తుది గడువు అని, నవంబర్ 2లోపు నామినేషన్ ఉపసంహరణ సమయం ఉందని ఈసీఐ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో ఎన్నికలు జరుగుతుండడంతో.. కోవిడ్-19 ఆరోగ్య నియమాలను తప్పనిసరి చేసినట్లు ఈసీ పేర్కొంది.

మాస్కులు, థర్మస్ స్క్రీనింగ్ తప్పనిసరి అని, సానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం నియమాలను అతిక్రమించరాదని ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story
Share it