న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2019 9:25 PM IST1. ‘ఈనాడు’ నుండి తప్పుకున్న రామోజీరావు.. ఆ భయంతోనేనా..?
రామోజీ రావు.. తెలుగు పత్రికా పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈనాడు అధిపతి. దాదాపు ఐదు దశాబ్దాలుగా తన శ్రమతో, ఆలోచనలతో, వ్యూహాలతో ఈనాడు పత్రికను అగ్రభాగాన నిలిపిన మీడియా మొగల్. అయితే.. రామోజీరావు అనూహ్యంగా ఈనాడు ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పటివరకు ఆయన ఈనాడు ఎడిటర్ హోదాలో ఉన్నారు. మాములుగా అయితే జర్నలిస్టులే పత్రికలకు ఎడిటర్లుగా ఉంటారు. కానీ.. రామోజీరావు జర్నలిస్టు కాకపోయినా ఎడిటర్‌గా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
2. భారత్ బచావో ర్యాలీ.. మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు దేశ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని రాహుల్ అన్నారు. రేప్ ఇండియా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు. భారత్‌లో ఎన్నో మతాల ప్రజలు ఉన్నారని తెలిపారు. తన పేరు రాహుల్ సావార్కర్ కాదని.. రాహుల్ గాంధీ అని అన్నారు. తాను నిర్భయంగానే మాట్లాడుతానని.. మోదీ, అమిత్‌షానే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
3. నిర్భయ నిందితులు జైల్లో సరిగ్గా తినడం లేదట..ఎందుకంటే..!
ఢిల్లీలో సంచలన సృష్టించిన నిర్భయ కేసులో నిందితులుగా తేలిన నలుగురికి త్వరలో ఉరిశిక్ష పడనుంది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులు తీవ్ర నిరాశలోఉన్నట్లు జైలు అధికారులు వెల్లడిస్తున్నారు. నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన పవన్ కుమార్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌సింగ్‌లను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచారు. ఒక్కొక్కరికి ఐదుగురు పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. నిర్భయ కేసు దోషి అయిన రాంసింగ్ 2013లో జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఇంకో దోషి బాలనేరస్థుడిగా పరిగణించి మూడేళ్లు జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురు దోషులకు సుప్రీం కోర్టు ఉరి విక్ష విధించింది.ఈ నలుగురు దోషులకు పోలీసులు నిరంతరం పహరా కాస్తున్నారు. ఈ సందర్భంగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
4. పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహంతో పరార్..!
తమ మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగిన కుటుంబీకులు .. మృతదేహాన్ని బైక్‌పై ఎత్తుకుని పరారైన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. ఇలా శవాన్ని బైక్‌పై ఎత్తుకుని పరారవుతున్న ఘటనను చూసి పోలీసులతో పాటు అక్కడున్నజనాలు సైతం నివ్వెరపోయారు. బైక్‌ను ఆపేందుకు పోలీసులు సైతం అడ్డుకోగా, వారిని తోసేసి వేగంగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
5. టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర.. అంబటి సంచలన వ్యాఖ్యలు..!
ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై పలు ఆరోపణలు రావడంతోనే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇదేదో పెద్ద జాతీయ సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయక సన్మానం చేస్తారా అంటూ అంబటి ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు సంబంధించిన కేసుల విచారణ సభ్యుల్లో కృష్ణ కిషోర్ ఒకడిగా ఉన్నారని.. అందుకే సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని చంద్రబాబు అనడాన్ని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
6. పంత్‌కు మా మద్దతు ఉంది.. అందుకే..!
టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ప్రస్తుత బ్యాటింగ్ పరిస్థితిపై అటు క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల విండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. అంతేకాదు.. గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్దసెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్. దీంతో పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రిషభ్ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
7. సమత కేసు: చార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు..!
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన సమత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సమత హత్యకు గురైన తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్జ్‌షీట్‌లో నిందితులు ఏ1-షేక్‌బాబు, ఏ2-షాబుద్దీన్, ఏ3-షేక్ ముగ్దమ్ పేర్లను చేర్చారు. హత్య చేసిన నిందితులపై 302, 376డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
8. ‘జ్యూస్ జాకింగ్’ కొత్త సైబర్ క్రైమ్
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కవగా ఉన్న ఈ రోజుల్లో వాటి ద్వారా జరుగుతున్న నేరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లకు పబ్లిక్ ప్రాంతాలలోని చార్జర్లను ఉపయోగించడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. వీటిని ఉపయోగిచడం వలన హ్యాకర్లు మీ ఫోన్ పాస్ వర్డ్ ను తెలుసుకొని మీ యొక్క వ్యక్తిగత విషయాలను చోరీ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
9. ‘వంగవీటి’ సొంత గూటికే చేరనున్నాడా..?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనేది మరోసారి నిజం చేసేందుకు సిద్దమవుతున్నారు వంగవీటి రాధాకృష్ణ. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఐకాన్‌గా ఉన్న వంగవీటి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ గుర్తింపు పొందారు. కాంగ్రెస్ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ ఇలా ఒక పార్టీ అంటూ లేకుండా వంగవీటి రాధాకృష్ణ దూకుడు ప్రదర్శించారు. ఒకప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనా.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
10. ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్‌తో విజయ్ దేవరకొండ..!
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. వేలంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...