'జ్యూస్ జాకింగ్' కొత్త సైబర్ క్రైమ్

By Newsmeter.Network  Published on  14 Dec 2019 1:13 PM GMT
జ్యూస్ జాకింగ్ కొత్త సైబర్ క్రైమ్

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కవగా ఉన్న ఈ రోజుల్లో వాటి ద్వారా జరుగుతున్న నేరాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లకు పబ్లిక్ ప్రాంతాలలోని చార్జర్లను ఉపయోగించడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. వీటిని ఉపయోగిచడం వలన హ్యాకర్లు మీ ఫోన్ పాస్ వర్డ్ ను తెలుసుకొని మీ యొక్క వ్యక్తిగత విషయాలను చోరీ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది .

ఈ రకమైన హ్యాకింగ్ ను 'జ్యూస్ హ్యాకింగ్' అంటారని.. ఒక ట్విట్ ద్వారా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మొబైల్ వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని.. ఛార్జింగ్ కేంద్రాలలో ఛార్జింగ్ లకు ఆటో డేటా ట్రాన్సఫర్ డివైస్ ను ఏర్పాటు చేయడం వలన ఎవరైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వారి సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తారని పేర్కొంది.

ఇలాంటి సైబర్ నేరాలను నియంత్రించడానికి బయటకు వెళ్ళిప్పుడు పవర్ బ్యాంకు లను ఉపయోగించడం మంచిదని వెల్లడించింది. దీని వలన మీ యొక్క సమాచారం హ్యాకర్లకు చేరే అవకాశం తక్కువగా ఉంటుందని.. ఈ సైబర్ నేరాలపై ఒక వీడియోను కూడా జత చేసింది.

Next Story