టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి కుట్ర.. అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

By అంజి  Published on  14 Dec 2019 12:34 PM GMT
టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి కుట్ర..  అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అమరావతి: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై పలు ఆరోపణలు రావడంతోనే ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇదేదో పెద్ద జాతీయ సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్‌ చేయక సన్మానం చేస్తారా అంటూ అంబటి ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు సంబంధించిన కేసుల విచారణ సభ్యుల్లో కృష్ణ కిషోర్‌ ఒకడిగా ఉన్నారని.. అందుకే సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని చంద్రబాబు అనడాన్ని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

తమ ప్ర‌భుత్వానికి ఆ అవ‌స‌రం లేద‌న్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారేమోన‌ని.. తప్పు చేశారని ఆధారాలుంటే చర్యలు తప్పవని అంబటి అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ కుట్రతోనే వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని అంబటి ఆరోపించారు. జ‌గ‌న్ ను అకార‌ణంగా 16 నెలలు జైల్లో పెట్టించింది నువ్వు కాదా అంటూ చంద్ర‌బాబును వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు.

Next Story
Share it