పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహంతో పరార్‌..!

By సుభాష్  Published on  14 Dec 2019 2:59 PM GMT
పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహంతో పరార్‌..!

తమ మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగిన కుటుంబీకులు .. మృతదేహాన్ని బైక్‌పై ఎత్తుకుని పరారైన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. ఇలా శవాన్ని బైక్‌పై ఎత్తుకుని పరారవుతున్న ఘటనను చూసి పోలీసులతో పాటు అక్కడున్నజనాలు సైతం నివ్వెరపోయారు. బైక్‌ను ఆపేందుకు పోలీసులు సైతం అడ్డుకోగా, వారిని తోసేసి వేగంగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..

కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) క్రిమిసంహారక మందుసేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుమారుడికి పోస్ట్‌మార్టం వద్దంటూ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో ఘర్షణకు దిగారు. మృతదేహాన్ని బైక్‌ పై తీసుకుని పరారవుతుండగా, పోలీసులు వెంటపడి పట్టుకోగా, పోలీసులను తోసేసి మరీ పరారయ్యారు.

Next Story
Share it