న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Dec 2019 8:39 PM IST
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

1. బిగ్‌బ్రేకింగ్‌: దిశ నిందితుల‌ ఎన్‌కౌంట‌ర్‌..!

దిశ’ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. కోర్టు అనుమతితో నిందితులను గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స్థ‌లానికి సీపీ స‌జ్జ‌నార్‌…

శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి సీపీ సజ్జనర్ చేరుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించేందుకు వైద్యురాలిని దహనం చేసిన ప్రదేశానికి తీసుకువచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. ఇక్కడ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. అక్కడ మరో దారుణం..!

యూపీలో ఘోరం జరిగింది. తమ దుర్మార్గాలని బయటపెట్టిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర షాక్‌కు గురైనప్పటికీ ఆ యువతి ధైర్యం కోల్పోలేదు. శరీరమంతా మంటలు వ్యాపిస్తున్నా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అంతేకాదు 112 నెంబర్ కూడా ఫోన్ చేసి తన పరిస్థితి వివరించింది. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె శరీరం 90% కాలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. సంచలనంగా మారిన ఆ మూడు ఎన్‌కౌంటర్లు

తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో భాగంగా నిందితురాలిని హత్య చేసి దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పైగా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. ఎన్‌కౌంట‌ర్‌కు స్క్రిప్ట్ 6 రోజుల ముందే రాశేషారా..? ఆ ట్వీట్ నిజ‌మేనా..?

దిశ రేప్, హత్య కేసులో సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు, అనగా శుక్రవారం తెల్లవారుజామున దిశ రేపిస్టులను సైబరాబాద్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. చాలా మంది పోలీసుల చర్యను తప్పు పట్టినా, ఎందరో ప్రజలు పోలీసుల చర్యపై సంతోష పడ్డారు. దిశ కు న్యాయం జరిగిందంటూ పోలీసులను కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. సింగపూర్‌లో భారత యువకుడికి ఏడాది జైలు..ఎందుకో తెలిస్తే..

సింగపూర్‌లో భారత యువకుడికి ఏడాది జైలు శిక్ష విధించింది అక్కడ న్యాయస్థానం. పైగా 15 లక్షల జరిమానా కూడా విధించింది. వ్యభిచార కార్యకలపాలు నిర్వహిస్తున్న 22 ఏళ్ల భారత యువకుడు సింగపూర్‌లో అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడికి అక్కడి న్యాయస్థానం ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ‘టాలీవుడ్‌’ ప్రముఖులు ఏమన్నారంటే..!

తెలంగాణ లోని షాద్ నగర్ లో దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సమంత, దర్శకులు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, హీరోలు మంచు మనోజ్, బాలకృష్ణ, వెంకటేష్ నాని, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నాగార్జున, కల్యాణ్ రామ్, విశాల్ , నిఖిల్, మంచు లక్ష్మి, రిషి కపూర్, బన్నీవాస్ తదితరులు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. ఆ న‌లుగురికి ఈ రోజు ప్ర‌త్యేక‌మైంది.. అందుకే బీసీసీఐ వారికి..

భార‌త క్రికెట్‌ జట్టులోని ఆ నలుగురు ఆటగాళ్లకు ఈరోజు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ నలుగురు భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించి విజ‌యాల‌లో పాలుపంచుకున్న‌వారే. వారందికి ఒకేరోజు ఎందుకు ప్ర‌త్యేక‌మ‌నుకుంటున్నారా..? వారంద‌రూ బ‌కే రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ఫై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

‘దిశ’ అత్యాచారం, హత్య ఘటనపై నిందితులను ఈ రోజు తెల్లవారు జామున కాల్చి చంపారు పోలీసులు. విచారణలో భాగంగా నిందితురాలిని హత్య చేసి దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పైగా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు…అందుకే…

‘దిశ’ ఘటనపై నిందితులను విచారించే క్రమంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించి, పైగా తమపై రాళ్లు రువ్వి ఎదురు దాడికి దిగే క్రమంలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన… ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులు పోలీసు అధికారుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని దాడికి దిగారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story