దిశ రేప్, హత్య కేసులో సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు, అనగా శుక్రవారం తెల్లవారుజామున దిశ రేపిస్టులను సైబరాబాద్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. చాలా మంది పోలీసుల చర్యను తప్పు పట్టినా, ఎందరో ప్రజలు పోలీసుల చర్యపై సంతోష పడ్డారు. దిశ కు న్యాయం జరిగిందంటూ పోలీసులను కొనియాడారు.

అయితే, 5 రోజుల క్రితమే @konafanclub అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ షేర్ చేయబడింది. ‘‘సర్. మీరు ఆ నేరగాళ్లను శిక్షించాలంటే.. వారు నేరానికి పాల్పడిన ప్రాంతానికి తీసుకెళ్లండి. క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో దిశను కాల్చి చంపిన చోటుకు తీసుకెళ్లండి. తప్పకుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో పోలీసులకు వారిని షూట్ చేయడం మినహా వేరే ఆప్షన్ ఉండదు. దీని గురించి మరోసారి ఆలోచించండి’’ అని అందులో ఉంది. తెలంగాణ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్ కి సమాధానం గా ఈ ట్వీట్ చేయడం జరిగింది.

ఆ ట్వీట్ ఆర్కైవ్ లింకు:

https://web.archive.org/web/20191201131159/https://twitter.com/konafanclub/status/1201122467944681472

ఈ ట్వీట్ లో చెప్పిన విధంగానే ఎన్ కౌంటర్ జరగడంతో నెటిజెన్లు అశ్చర్యపోయారు. ఇది యాదృచికమా లేక ఈ ట్వీట్ ను చదివాకే ఎన్ కౌంటర్ జరిగిందా అంటూ సోషల్ మీడియా ని నెటీజెన్లు ప్రశ్నలతో నింపేశారు.

కోన వెంకట్ సుప్రసిద్ధ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆయన ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న ట్విట్టర్ అకౌంట్ లో రాసిన తరహాలోనే ఈ రోజు అంటే, డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ జరగడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఈ ట్వీట్ నిజమైనదే కానీ, ఈ అకౌంట్ ఎవరిదో తెలియదు. ఎందుకంటే, ఈ అకౌంట్ ట్విట్టర్ నుంచి తొలగించబడింది. ఈ అకౌంట్ ని ట్విట్టర్ తొలగించిందా లేక వారే పేజ్ ను తొలగించుకున్నారా అనే విషయం నిర్ధారణ కావాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.