ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స్థ‌లానికి సీపీ స‌జ్జ‌నార్‌...

By Newsmeter.Network  Published on  6 Dec 2019 2:57 AM GMT
ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స్థ‌లానికి సీపీ స‌జ్జ‌నార్‌...

శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి సీపీ సజ్జనర్ చేరుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించేందుకు వైద్యురాలిని దహనం చేసిన ప్రదేశానికి తీసుకువచ్చారు. అయితే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నించడమే , కాకుండా పోలీసులపై రాళ్లు రువ్వేందుకకు ప్రయత్నించగా, అత్మరక్షణ కోసం పోలీసులు వారిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీపీ సజ్జనార్ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా, తెల్లవారుజామున 3.30కి ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం.

Next Story
Share it